01 August 2010

నిర్మాణం

Diaries wait over the bookshelf in the mirror

లేఖలు. వాచకాలు. దేన్ని కప్పి పుచ్చుకునేందుకు పుస్తకాలపై అట్టలు వేసుకుంటాం?
పుస్తకాల కింద దుమ్ము చేరేందుకు మడచి పెట్టిన పేపరు
ఇక గాలికి గదంతా ఎగురుతుంది.
గాలిలో కొన్ని పదాలున్నై. అప్పటి దాకా నువ్వు వినని గుసగుసలు ఉన్నాయ్. అద్దానికి
మరోవైపు కనిపించే ప్రతిబింబాలున్నై.

చదవటానికి ముందు, పగిలిన అద్దం ముక్కను మట్టిలోంచి ఏరుకుని
దీపంతో మసిని పులుము. రచనాగ్రహణం చూసేందుకు రెండు నయనాలూ చాలవు:
అంధుడువి అయినా కావాలి లేక అద్దాలనైనా ముక్కలు చేయాలి.

letters wait: over the mirror in the bookshelf.

శైలి. సత్యం. వర్షం చినుకు చిట్లుతున్న తునకలో ఒక గొంగళిపురుగు పాదాల్ని మోపుతూఉంటె
నువ్వు దేహం మధ్యగా ఒక bookmark ని అమర్చుతావు.
నేను అక్కడిదాకే చదివానా, నేను అక్కడదాకే అట్ట వేసానా? గదికి గడపలాగా, బయటా లోపలా
కాకుండా, దువ్వెన మధ్య చిక్కుకున్న శిరోజాలను విడదీస్తున్న శైలిపై మెరిసే
కిటికీలోని సూర్యరశ్మిని, పుస్తకాల అర లోని పుస్తకాలు బద్ధకంగా చూస్తాయి.
పుస్తకాలలోని కొన్ని పదాల పక్కగా గీసిన గీతాలు, మరో పుస్తకంలోంచి రాసుకున్న అర్థాలు
కనిపించని సత్యాల వైపు మరులుతాయి.
పుస్తకాలమధ్య ఇరుక్కున్న గాలి, గాలిలో ఇరుక్కున్న పదాలూ, పదాలలో ఇరుకున్న దేహాలు:

spaces wait: in the mirror and in the letters,
over the bookshelf among the diaries.

చదివేందుకు తొందరపడకు. ప్రతీకాత్మకంగా నృత్యం చేసేందుకు వేగిరపడకు. వేచి చూడు. ఆరిన
దీపం రాత్రికి వేచి చూసినట్టు, దుస్తులు విడిచిన
ప్రియుడు నిండు కళ్ళతో, కళ్ళలో కదులాడుతున్న సూర్యుడు జాబిలికై ఎదురు చూసినట్టు, ఒక
స్త్రీ నింపాదిగా దుస్తులు కట్టుకుంటున్నట్టు,
ఇంకా అమర్చని పుస్తకాలకి ఖాళీ అర ఒక సాలీడుతో అలా నిలబడి ఉన్నట్టూ
డైరీల్లాగా, ఉత్తరాల్లాగా, సగం పగిలీ పూర్తి ముఖాన్ని చూపిస్తున్న అద్దంలాగా , పదలకావలగా
లేఖలి ఆవలగా, అద్దానికి ఆవలివైపు ఓపికగా వేచి చూడు:
pleasure is not so simple.

No comments:

Post a Comment