నువ్వు ఇచ్చిన ఉంగరంలో అంతమైన శూన్యం పరుచుకుని ఉంది
ఆ శూన్యంలో నువ్వు పలికిన మాటలు ఉన్నాయి
ప్రతి మాటలో ఒక ముఖం కనిపిస్తుంది
నవ్వుతూనో రోదిస్తోనో నొప్పిని కళ్ళతో అణచిపెట్టుకునో
ప్రతి ముఖం లో ఒక ప్రతీక కనిపిస్తుంది
ప్రతి ప్రతీకా
నేను ఇది వరకూ చూడని దారులను సృష్టిస్తుంది. ఇక
నేను ప్రయాణించాలి, ఆ దారులలో
పదాలు సోకని దూలిలా మారేదాకా, శరీరం గాలిలా కరిగేదాకా
నాతో నేను ఒంటరిగా ప్రయాణించాలి
నువ్వు ఇచ్చిన ఉంగరంలో పరచుకున్న అనంతమైన శూన్యంలో
ఇక నేను అనంతంగా వలయాలై కోల్పోవాలి
No comments:
Post a Comment