పాడుబడిన పాక పక్కగా చెట్టు కింద పగిలి ఉన్న మట్టి కుండలో తిరుగాడే గాలి నీ స్పర్శ
నీరూ లేదిక్కడ, నిప్పూ లేదిక్కడ
గాలీ లేదు, వర్శమూ లేదు నొప్పీ లేదు. అదేమిటంటే ఉన్నదల్లా
పాడుబడిన పాక పక్కగా చెట్టు కింద పగిలి ఉన్న నా అస్తిత్వపు నల్లటి మట్టి కుందని
నింపే నీ స్పర్శా జ్ఞాపకం మాత్రమే.
No comments:
Post a Comment