నీ నయనం
చీకట్లో నా శరీరం వైపు తళుకులీనుతూ దూసుకు వచ్చే
ఒక తెల్లటి
పాలరాయి
తనలో తాను ముడుచుకున్న ఈ రాత్రి
ఒక ఉన్మాదపు విహంగం
తన చుట్టూ తాను చుట్టుకున్న నీ పదం
ఒక మృత్యు గీతం
నా స్వప్నం లోంచి శూన్యాన్ని విడదీసే
నీ రెండు అరచేతుల మధ్య
నా నయనం
చీకట్లో నీ శరీరం వైపు తళుకులీనుతూ దూసుకు వెళ్లే
ఒక నల్లని
పాలరాయి!
చీకట్లో నా శరీరం వైపు తళుకులీనుతూ దూసుకు వచ్చే
ఒక తెల్లటి
పాలరాయి
తనలో తాను ముడుచుకున్న ఈ రాత్రి
ఒక ఉన్మాదపు విహంగం
తన చుట్టూ తాను చుట్టుకున్న నీ పదం
ఒక మృత్యు గీతం
నా స్వప్నం లోంచి శూన్యాన్ని విడదీసే
నీ రెండు అరచేతుల మధ్య
నా నయనం
చీకట్లో నీ శరీరం వైపు తళుకులీనుతూ దూసుకు వెళ్లే
ఒక నల్లని
పాలరాయి!
No comments:
Post a Comment