నువ్వు నా ముఖాన్ని ఇష్టపడవన్నది వేరే విషయం. ఆఖరుకు గోడపై మెరిసే నల్లటి నీడ కూడా
తన రెక్కలని శుబ్రపరుచుకుంటున్న సాయంసమయపు పిట్టను ఇష్టపడదు
నిరంతరం అకారణంగా ఆ స్త్రీ తన భర్తను శపిస్తూ ఉంటుదనేది, నిరతరం కారణంతోనే ఆ పిల్లవాడు
తలుపులు వేసిన ఇంట్లో వొంటరిగా రోదిస్తూ ఉంటాడనేది, నిరంతరం రాత్రి మృగం వీధులలో
నిదురలేని అనాధను వేటాడుతూ ఉంటుందనేది వేరే విషయం.
నువ్వు మరొక పురుషుడితో రమిస్తావనేది, నేను అనేక స్త్రీలకు తల్లిని అవుతానన్నది వేరే విషయం;
ఇక నా జీవితం నీ రక్తంతో అంచులదాకా నిండిపోయి ఉంటుందనేది, నీ రక్తం
మృత్యు సీతాకోక చిలుకలను ఆహ్వానిస్తూ ఉంటుందనేది, మృత్యువు ఈ కవిత మూలిగను పీలుస్తూ
ఉంటుందనేది
నిజంగా నిజంగా నిజంగా వేరే విషయం.
No comments:
Post a Comment