ఒక చెట్టు హత్య చేయబడింది
చాలాకాలం క్రితం, ఆ పిల్లవాడు తన కలలో పక్షి ఎగరడాన్ని చూడక మునుపు
ఒక పదం హత్య చేయబడింది
ఇల్లు లేక ఆ ఆకు పిల్లవాడి నాలికకై వెదుకులాడుకుంటుంది
చాలాకాలం క్రితం, మొదటి శబ్దం మొదటి అక్షరం ఉచ్చరించబడక మునుపు
ఒక పక్షి కలలో, ఒక చెట్టు కలలో
ఒక పిల్లవాడు హత్య చేయబడ్డాడు
ఇక, శబ్దపు ఆకుపచ్చని నిశ్శబ్దం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?
No comments:
Post a Comment