తాగుబోతులు ప్రేమించే ఈ తెల్లటి రాత్రిలో
మెత్తటి పూవులుగా మారే పచ్చటి ముళ్ళు ఉంటాయి, చెదిరిన
రక్తపు చిత్రాలుగా మారిన
మెత్తటి రూపాలూ ఉంటాయి.
తాగుబోతులు ప్రేమించే ఈ తెల్లటి రాత్రి నలుపులో
ఆ అస్పష్టపు పొగమంచు
మరొక సమయంలో వొదిలివేసినదాన్నేదో గుర్తుచేస్తూ, నెమ్మదిగా
ఎవరికీ చెందని ఈ అస్థిత్వాన్ని కమ్మివేస్తుంది.
baagundi...
ReplyDelete