08 August 2010

నిన్ను నువ్వు స్వప్నిస్తూ

నిన్ను నువ్వు స్వప్నిస్తూ నన్ను కలగంటావు

మృత్యువుకై సాగిపోతూ
నా అరచేతుల మధ్య క్షణకాలం ఆగి విశ్రమించే నీ చేతికి
శతాబ్దాల అలసట తెలుసు. ఆ క్షణిక సమయంలో
నువ్వు కూడా స్వప్నిస్తావు
నీరెండలో, నీటిలో రెక్కలు విదిల్చే ఒక కాంతి పక్షిని.

నువ్వు కూడా ఒక రక్తపు పక్షివి.

రాత్రి తర్వాత రాత్రి ఒక ప్రమిదెకై తపిస్తూ
నిన్ను నువ్వు స్వప్నిస్తూ నన్ను కలగంటావు.

No comments:

Post a Comment