03 August 2010

ఇతరులకి ఇద్దరు. ౧*

గోళ్ళలాగా జ్ఞాపకాలు పెరుగుతాయి . ఎన్నిసార్లు తీసుకున్నానో తెలియదు
నిశ్శబ్దాల్లాగా , మళ్ళా గమనించే లోపల, ప్రత్యక్షమవుతాయవి
వోదులుకోలేని ప్రేమలు అవి
శరీరంపైనా, శరీరం లోపలా వేళ్ళూనుకుని, మరచిపోతున్నప్పుడల్లా
దేనికో తగిలి చిట్లిపోయి
నొప్పితో విలవిల లాడేలా చేస్తాయవి. మొక్కలల మళ్ళా చిగురిస్తాయవి
గోళ్ళలా పెరుగుతాయవి

*texts in this series should be read as a manifestation of different voices, voices with differnt sexes or as a dialogue.

No comments:

Post a Comment