నేను ఈ దుస్తుల్ని వెన్నెలతో అల్లుకున్నాను
నువ్వు గాయపడితే
ఒక దారపు పోగును తీసుకుని గాయానికి చుట్టుకో
రాత్రిపూట వీచే గాలిలా
నీకు ఉపసమనాన్ని కలగచేస్తాను
నువ్వు గాయ పడక పోయిన
ఈ దుస్తుల్ని అందుకుని నీ తలగడగా మార్చుకుని
విశ్రమించు. నీ నిదురలోకి
నువ్వు ఊహించని కలలా వస్తాను. చూడు
నేను ఈ దేహాన్ని వెన్నెలతో అల్లుకున్నాను
సూర్యరశ్మి నన్ను ముంచివేసే దాక ప్రేమించు
నువ్వు ప్రేమించకపోయినా కనీసం గాయపరచు
రేపు నీ స్నేహితులు
తూర్పున రక్తంతో మెరుస్తున్న జాబిలిని చూస్తారు.
wonderful poetry rasthunnaaru mithramaa
ReplyDeletem.s.naidu sent you this link.
thanks to him
keep writing.
really excellent imegery and wonderful poetry
thank you
bollojubaba