ఎవరిది ఈ అస్తిత్వపు నలుపు గులాబి, ఈ దినం మరోమారు నిస్సహాయంగా రాలిపోతుంది
ఎవరి పాదాలు తాకాయి ఈ అస్తిత్వపు నల్లటి మట్టిబాటని? మృత్యు ప్రేమతో ఈ
సమయంలోకి మెత్తగా భూమిలోకి కుంగిపోతుంది?
పుష్పాలూ, స్త్రీలూ పిల్లలూ. అలసిపోయారు వీరంతా ఈ పూట. నిర్లిప్తంగా సాగే గమ్యంలేని
బాటసారిని కనులతోనైనా పలుకరించలేనంతగా సోలిపోయారు వీరంతా. ఇక ఈ నైరాశ్యపు
రాత్రిపూట ఎవరి అస్తిత్వపు నలుపు గులాబీ పాదాలవద్ద ఈ హృదయాన్ని పరచుకోవాలి?
ఏ ఏ దీపాలవద్ద ముందుకు సాగలేని నిస్సహాయతతో గాలిలో నలుదిశలా వెదజల్లబడాలి?
No comments:
Post a Comment