05 August 2010

ఇతరులకి ఇద్దరు. ౧౪. (ప్రేమ)

రాత్రంతా మేలుకుని నువ్వు నీతో మాట్లాడుకుంటావు
ఎవరూ వినరు, ఎవరూ బదులివారు
కిటికీ అవతలగా చీకట్లో మెరిసే మసక నక్షత్రాల కాంతిలో
ఎవరూ లేని పాదాల సవ్వడి
నిన్ను సన్నటి గాలిలా తాకి వెళ్ళిపోతుంది. ఇక
పొదలలో మెదిలే పిల్లీ
నిండుగా కదులాడే మొక్కలూ, ఎవరో వోదిలివేసిన
గాజు కన్నూ నిన్ను నిర్లిప్తంగా చూస్తాయి.
అందుకని నువ్వు
రాత్రంతా మేలుకుని చూపుడు వేలితో గాలిలో లేఖలు రాస్తావు
నీకై నువ్వు నీలో ఒక సమాధిని తయారు చేసుకుంటావు.
ఆపై తొలి వెలుతురులో
తోటలోని గాజు కన్నుని తుడుచుకుని, లేని కంటిలో అమర్చుకుని
నీలో నువ్వు మరణిస్తావు.

No comments:

Post a Comment