ఏం జరుగుతుందో అది జరుగుతుంది
ఆకాశంలో పాలరాతి కన్ను. దాని చీకటి లిపి నీకు తెలుసా?
నాకు తెలియదు. ఎవరూ చూడని
నా లోపలి సమాధిని అది తాకగాలదో లేదో కూడా నాకు తెలీదు. అందుకని
పడుకున్న పాపకు కథలు చెప్పుకుంటాను. నిండుగా తెరుచుకున్న
కనులతో విన్తున్ధది. అది వింటున్నది
అర్థాన్నా, శబ్దాన్నా? నాకు తెలీదు? అప్పుడు, తనను
నా వక్షోజానికి అదుముకుని చనుమొనని అందిస్తాను. నిండుగా
తెరుచున్న కళ్ళతోనే తాగుతుంది. ఇక
నా దేహం కధగాను, అర్థంగానూ మెల్లగా మారుతుంది.
ఏం జరుగుతుందో అది జరుగుతుంది
No comments:
Post a Comment