ఒంటరి మనిషొకడు కవితల్ని వ్రాస్తాడు
ఒంటరి మనిషొకడు కవితల్ని రమిస్తాడు
ఒంటరి మనిషొకడు కవితలలోంచి నడచి వెళ్ళిపోతాడు
ఆ తరువాత
ఒంటరి మనిషొకడు కవితలన్నిటినీ
తను చేసిన మరచిపోలేని పాపాల్లా తలంచి
ముక్కలు ముక్కలుగా చేసి విసిరి వేస్తాడు
ఆ తరువాత
ముక్కలైన కాగితాలలోంచి పదాలన్నీ ఒక దరికి చేరి
రెండు రంగుల ఇంద్రధనస్సుల్లా
జీవితాన్ని తిరిగి ఇచ్చే అధ్బుతమైన ఆమె అరచేతుల్లా మారతాయి
ఆ తరువాత
దప్పికగొన్న ఆమె కలలో కదులాడిన ఒంటరి మనిషి పక్కగా
ఒక మహా సముద్రం కదులాడుతుంది
ఆ తరువాత
ఆమె రెండు చేతులూ రెండు అలల్లా అతడిని ముంచివేసి
అతడి మృత దేహాన్ని ఒడ్డుకు విసిరి వేస్తాయి.
శ్రీకాంతేం కవిత్వమిదీ?
ReplyDeletegreat poem
ReplyDelete