గాలి నీటిపై రెక్కల్ని చాచి రివ్వున ఎగిరే నల్లటి పిట్ట
ఆకాశం కంటిలోకి దూసుకువెళ్ళే
ఒక కవిత. అది సముద్రానికి తన రెక్కల్ని విప్పుతున్న
ఒక అల. కదలికలోకి
విరుగుతున్న ఒక కల.
ఒక్క క్షణానికై, అనంతానికి మట్టినీటిపై రెక్కల్ని చాచి
రివ్వున ఎగిరే నల్లటి కవిత
ఆకాశం కంటిలోకి దూసుకువెళ్ళే ఒక పిట్ట.
No comments:
Post a Comment