ఈ గులక రాయి సూర్యరశ్మిలో నానుతూ మృత్యువుకై ఎదురుచూసే ఒక మనిషి
లేదా అది విశ్రమించే ఒక పక్షి
లేదా అది తనను ప్రేమగా అందుకునే తిరుగుబోతుకై ఎదురుచూసే ఒక పధం, శబ్ధం
ఎవరికీ తెలుసు, ఈ సాయంసమయం తరువాత చీకట్లో
ఎవరు ఈ గులక రాయిని అందుకుని వేణువులా ఊదుతారో
ఎవరు ఈ గులక రాయిని ఒక గీతంలా పాడతారో
ఎవరు, సముద్రాన్నీ గులక రాయినీ పక్షినీ పదాన్నీ శభ్దాన్నీ సముద్రపు వేణు గానాన్నీ
ఎలాప్పుడూ ప్రేమించిన చేతులతో హత్తుకుంటారో?
No comments:
Post a Comment