31 March 2018

|| దీపస్థంబాలు, 3 కవితలు ||

1


దీపస్థంబాలు

ఎంతో వొంటరిగా అవి; మరి
ఈ రాత్రిపూట,
వడలిన పూలదండలైతే,

బస్స్టాప్లో, ఒక మూలగా ఇక
కమ్మీకి ఆనుకుని
నువ్వు ; చేతిలో సెల్ఫోన్,

ఎర్రని జాబిలి. ఇంకా వేడిగా
గాలినీ ముఖం
నీ శరీరం, తెల్లని కుర్తీలో

ఎంతో వొంటరిగాఅలసినో 
పుష్పగుచ్చమైతే,
నీ కళ్ళల్లో, క్రమక్రమంగా

చలిస్తో వ్యాపించే, జాడలు;
అంతంలేని/ కాని
ఈ దీపస్థంబాల నీడలు!

2

ఎట్లా?

ఎట్లా చెప్పాలి?

"నీ ప్రకంపనలు వినిపించే
రాత్రి ఇది మరి"
అని పిలవనా? లేకపోతే

"a/c యూనిట్ శబ్దానికి ఇక
గూడు పోయిన
పిట్టల తండ్లాట" అననా?

"మృత్యువుకి చేరువౌతున్న
అమ్మ కనుల
అలికిడి", అని పిలవనా

లేక "సర్పాలై మెలికలుగా
నేలపైనుంచి
లోపలికి వ్యాపించే ఏవో

దీపస్థంబాల నీడల భాషవి 
నువ్వు", అని
సంబోధించనా? ఎలా 

ఎలా చెప్పా లి, నా నిన్ను?


3



... అనకు,

ప్రేమ అని అనకు దానినిఇక
మరేదో పేరుతోనే
పిలుద్దాం ఇద్దరందానినే,

తెరచిన కిటికీలోంచి వ్యాపించే
వొంటరి రాత్రినీ,
బాల్కనీలో రాలిన గూడునీ,

ఖాళీయై తపించే బాహువులనీ
పెంకుల కళ్ళనీ,
మరి ఈ నిస్సహాయ కవితనీ!
***
ప్రేమ అని అనకు దానినిఇక
'ఇదే జీవితంఅనో
'అదే నువ్వుఇక ఇదే నేను'

అనోఅని మాత్రమే పిలుద్దాం
ఇద్దరమూ దానిని,
రెండు రాళ్లైమిగిలీ/పోయీ!

29 March 2018

ఈ క్షణం, 3 కవితలు

1.
గమ్యం
ఎండలో వచ్చావు; ముఖాన తడి,
పచ్చిక వొత్తిగిల్లినట్టు
ఓ పక్కగా వొదిగి కూర్చున్నావు,
పొదిగే పిట్టల్లాగా నీ కళ్ళు , అట్లా
తెరిపారా నను చూస్తో;
"నీళ్ళు కావాలా?" అడుగుతాను

నేను: "ఊహు: వెళ్దాం" అంటావు
నువ్వు . కదులుతాను
నేను ఇక నీతో మరి, కానీ ఎటు
వెడుతున్నానో, నాకసలే తెలీదు!
2.
balm

అసంకల్పితంగా, నీ పెదాలని
తుడిచాను నేను,
నా ముంజేతికి లేతెరుపు రంగు
'స్ట్రాబెర్రి లిప్ బామ్' నవ్వుతావు
నువ్వు ; స్ట్రాబెర్రీ
జ్యూస్ గ్లాస్లోంచి పైకి చిల్లినట్టు

చీకటి పడింది; చల్లని రాత్రిలో
ఇక గగనమంతా
ఎన్నెన్నో స్ట్రాబెర్రీ పూవులు,

నీ మాటలై మిలమిలా మెరుస్తో!

3.
కృతజ్ఞత

రేర్ వ్యూ మిర్రర్ లోంచి చూస్తూ
కూర్చున్నాను,
చిన్నగా నడచి వచ్చే నిన్ను

చూడాలని; దారిపై ఒకటి వెంట
మరొకటి వాహనాలు,
అలుపు లేకుండా, ఎక్కడికో!
క్షణం ఆగే తీరిక లేకుండా మరి
మనుషులు కూడా;
ఫ్లై ఓవర్లై, సెల్ఫోన్లై, ఎక్కడికో!
***
రేర్ వ్యూ మిర్రర్ లోంచి చూస్తూ
కూర్చున్నాను;
చిన్నగా నడిచి వస్తూ నువ్వు

ఎంతో ఎండలో ఒక్కసారిగా మరి
వాన కురిసి, చెట్లు
వొణికి పూలను రాల్చినట్టూ,
ప్రాణం మళ్ళీ లేచొచ్చినట్టు!

12 March 2018

ప్రకంపన

చీకటి పడింది; ఎవరో నింపాదిగా అన్యమనస్కంగా ఒక నెత్తుటి బొట్టుని పెద్దదిగా చేస్తోన్నట్టు రాత్రి;"you see, it's happening again. Again and again. How to take it? I'm dying. I'm dying of this neglect; Of this game, of this cruel game; of this cruel game called love; of this ... can't you see?" she said -

అపార్ట్మెంట్ బయట, దూరంగా ఎక్కడో పగిలిన నేల. ఎండిపోయిన ఆకుల వంటి కాంతి; నారలు నారలుగా రాత్రి అల్లుకుని మెడ చుట్టూ చుట్టుకుని బిగుసుకుంటున్నట్టు, కంఠంలో ఒక బ్లేడైనట్టు, సన్నటి వణుకై, ఒక ప్రతిధ్వనై, ఎవరికీ ఎవరూ లేని, మిగలని ఒక ప్రకంపనై,  వలయాలై విలపించే నెత్తురోడే వేణువై, ఒక విగత శరీరమై, పగిలే ఆశ్రువై - 
***
"I'm dying, don't you see?", she murmured again,(perhaps to herself or to no one )closing the windows of the room: సొమ్మిసిల్లిన శిశువుతో ఎవరో అంత ఎండలోనూ చేతులు చాపి, జీవితం కోసమో లేక మరి వృక్షఛాయవంటి ఒక హృదయం కోసమో ఒక కూడలి వద్ద అలా నిలబడి వేచి చూస్తున్నట్లు! 

10 March 2018

shit

"నో మోర్ అఫ్ దిస్ షిట్" అతను
అనుకున్నాడు,
ఎన్నోసారో అసలే తెలియదు

వెనుకగా వరసగా భవనాలు; మరి
అక్కడే ఒక
సరస్సు, ఊగిసలాడే అలలతో,

లోకమంతా ఇంతేనా? ప్రొక్లైనర్లతో
ఇంకా లోపలికి
త్రవ్వుతో, ఏమీ మిగలనంతగా

కొల్లగొట్టుకుని పోతో? ఛాతిలో ఒక
హృదయం అంత
కంత; వండ్రంగి పిట్ట ఒకటి

పొడిచి పొడిచి చేసినట్టు; వలలో
చిక్కినదేదో మరి
శ్వాసకై తపిస్తోన్నట్టు: ఛత్ ...
***
"నో మరి అఫ్ దిస్ షిట్" అతనే
అనుకున్నాడు,
అక్కడనుంచి ఇంకా వెళ్లలేక,

ఎప్పటికో ఒక మెసేజ్, వాట్సాప్లో
"Hi. ఉన్నావా?
where are my red roses?"

be

నీ అరచేతుల నిండా వెల్లుల్లి వాసన
నా ముఖాన్ని ఇక
ఆ చేతులతో నిమిరినప్పుడు,

వొలిచిన రెమ్మలేమో ఇకా ఉదయపు
పల్చటి ఎండలో
నేలపై మెరుస్తో:మరి పొట్టేమో,

రాలిన ఆకుల వలే గాలికి ఊయల
ఊగుతో;  చూడు,
ఋతువు మారుతోంది. మరొక

వేసవి కొమ్మల్లోంచీ, కుళాయిపై ఆగి
అరిచే కాకీలోంచీ,
కొత్త కుండలోంచీ, చల్లని

నీళ్ళై, నీ చేతులలోంచి జీవధాతువై
మరో వేసవికై, ఇట్లా
వొలిచిన వెల్లుల్లి రెమ్మలై,

నీ అరచేతుల్లో ఒదిగే నేనూ, ఇంకా
కూర్చుని నిన్నే
గమనించే పిల్లల ముఖాలై!
***
నీ అరచేతుల నిండా ఒక సువాసన
జీవన శ్వాసై మరి
పరిపక్వమైన ఒక మెలకువైతే,

నీతో ఉండటం ఎంత బావుంది! 

09 March 2018

writing

మణికట్టు దాకా తెగిన చేతులు. ఇక,
నీ ముఖాన్ని
పొదివి పుచ్చుకోవడం ఎలా?

ఓ నెత్తుటి ధార. శ్వాస అందక భాష,
తెలుపు కాగితాల
దిగంతాల చీకటి: ఇక్కడ(డే),

నీ ముందు, మోకాళ్లపై వొరిగిపోయి
నిను అర్దిస్తో
తలను వొంచి నీకు లొంగిపోతో!
***
మణికట్టు దాకా తెగిన చేతులు, అవి
దారికిరువైపులా
రాలిన రక్త వర్ణపు పూలు: అవే,

చెల్లాచెదురై తడిచి చితికి, చివరికి
అతనై, 'వొద్దు'
అని, గాలికి చేతులు మోడ్చి! 

decompose

"దడదడమని బాదినట్టు, లోపల 
ఒకటే శబ్ధం,
పట్టేసినట్టు కూడా. ఏం

చేయను నేను?" She asked him
***
లేచి వెళ్లి,ఒక గ్లాసు మంచినీళ్ళూ
మాత్రా తెచ్చి
ముందు ఉంచాడు అతను,

"please sleep, it's 12:00" అంటో!
***
బయట మరి రాలిన వేప ఆకులు 
రాత్రిలోకి కుంగి, 
ఇంకా కొంచెంగా శిధిలమవుతో!


dumb

కనుల కింద తెగని రాత్రుళ్ళు, మరి 
దారాల్లాంటి చీకట్లు
అల్లుకుని ఒక తాడై మెడకి 

చుట్టుకున్నట్టు: నువ్వో ప్రతిధ్వనివి 
అయినట్టూ, ఇక 
ఆ కంపన మొదలయినది

ఎక్కడో తెలియక,మళ్ళీ మళ్ళీ తిరిగి  
నిన్నే చుట్టుకుని, 
'వదలకు' అని అర్ధించినట్టూ, 

జీవితం ఒక బిక్షపాత్ర అయ్యి, నేనో 
మూగ యాచకుడనై 
అట్లా నీ ముందు నిలబడినట్లు! 
 ...
***
true; your face is a paradise of peace
but how come, 
you are so fucking ugly inside?

అస్వస్థత

తేనెలాంటి చీకటి; మెరుస్తో
ఒక చుక్క,
మిణుగురై పావురం పిల్లై

దాహమై నేలై గాలై పగిలిన
పెదిమల
నేనై, ఒక్క నేనే అయితే
***
తేనెలాంటి చీకటి, చేదుగా
విషంగా, మరి 
చాచిన ఒక అరచేయిలా,

ఖాళీగా మరో అరచేయి లేక
విగతగా; you know,
you're a freaky fucking lie!  

08 March 2018

barista/bastard

వొక్కదానివే కూర్చున్నావు నువ్వు
అంతసేపూ,
baristaకదా కాఫీ షాపు పేరు?

మారుతోన్న సూర్యకాంతి. వృక్షాలు
వడపోస్తోన్న
గాలి. లోపలికి వినిపించని

వాహనాల రద్దీ,ఆ హోరు శబ్దాలూ
నీ శరీరంలో
ఇక మ్రోగుతో, ప్రతిధ్వనిస్తో!
***
వొక్కదానివే కూర్చున్నావు నువ్వు
అంతసేపూ!
ఈలోగా మరి చీకటి పడింది,

వెళ్ళే వేళ అయ్యింది: వొంటరిగా
లేచి నువ్వు,
విసుగ్గా అలా కదిలినప్పుడు

bastardకదా నా పేరు అపుడు? 

ఏదో

కనులు తెరచిన వెంటనే, ఎదురుగా
నీ కళ్ళు,
వాన కురిసే సాయంత్రాలై,

ఏం జరిగింది? అడుగుతాను చిన్నగా
ఇక, ఏదో
అలజడిని నింపుకుని ఊగే

ఆ చెట్లనీ గూళ్ళనీ మెడలు మాత్రమే
బయట పెట్టి
చూసే రెండు నల్లని పిట్టల్నీ!

వాటిదంతా కూడా చెట్ల భాష. రెక్కల
భాష: గాలి భాష,
ఊగే నీడల తెల్లని రాత్రి భాష,

ఒడ్డు నుండి ఒడ్డుకు అలలుగా కదిలే
సరస్సుల భాష,
ఆ నీటి శబ్దాల రహస్య భాష!
***
కనులు తెరచిన వెంటనే, ఎదురుగా
నీ కళ్ళు,
వాన కురిసే నల్లని రాత్రులై

ఏమీ చెప్పక, అసలేమీ అనక! 

07 March 2018

లేక

వెళ్ళడానికి ఎటూ లేదు
బయట
కొంచెం చీకటీ, చేదు

ఎవరైనా వచ్చి వెళ్ళారా?
లోపల
ఖాళి. దాహమేసి గాలీ!
***
వెళ్ళడానికి ఎటూ లేదు!
దూరంగా
ఎక్కడో, మరి నీవైపు 

చేతులు చాచి, రమ్మనే 
వొణికే చెట్లూ, 
బ్రతికి ఉన్న రాళ్ళూ!

సూచన

"కొంచెం కాంతిని లోపలికి రానివ్వకూడదూ?"
అని సూచించింది తను,
ఆరిన దుస్తులను మడత పెడుతో,

"Summer has arrived quite early 
this time: isn't it?
Look at those birds, how 

they thirst! మరి అది నీళ్లకోసమేనా?" 

అని అడిగి, క్షణకాలం తనవైపు తీక్షణంగా 
చూసి, చిరునవ్వుతో, 
తెరచిన తన తలుపులను విసురుగా 

మూసి వెళ్లిపోయాడు అతను! మిగిలిన ఒక  
తెల్లని రుమాలుని మరి
ముడవక, ఒక పూవులా చుడుతో  

అనుకుంది తను ఇట్లా:'ఎన్నోసారి ఇలా?'

retrospect

నీళ్ళు పోయలేదు ఎవరూ నీకు,
వేడిమి తెరలకి 
ఈ వేళకల్లా వడలిపోయి, 

ఒరిగి, ఎలాగో అయిపోయి, ఇక 
నీ పెదిమలు 
తడుపుకుంటూ నువ్వు

అవును:నీళ్ళు వొంపలేదు ఎవరూ
కానీ, అందరికీ
తాజాగా మెరిసే పూవులు 

మాత్రం కావాలి నీలో ఎల్లప్పుడూ
ఆకర్షనీయంగా,
మరి సువాసన భరితంగా!
***
ఓ అమ్మాయీ,కానీ నీలోని వేర్లని
పట్టించుకున్నదీ
సాకిందీ, మేము ఎన్నడు? 

06 March 2018

broken

"my white white lily, చూడు ఇటు
don't be afraid,
you're still so beautiful

అని అన్నాడు అతను: ఎముకలైన 
చేతులను 
అతని మెడ చుట్టూ 
వేసి, కృంగిన కళ్ళని అతని 

ఛాతిలో పాతుకుని, నెత్తురు పూచే ఒక మొక్కై 
మొలకెత్తుతో, 
పెద్దగా ఏడ్చింది తను: తెగి 

ఉబికే గొంతుకతో, వొణికే శరీరంతో హత్తుకుని 
ఏదో చెప్పాలనీ 
చెప్పలేక,వొదలలేక మరిక 

ఓ ఐదడుగుల అశ్రువై, రాలి చిట్లి చెదిరిపోతో 
చీకటి కమ్మిన
తెల్లని రాత్రుళ్ళలో, నొప్పితో

రేకు రేకుగా వీడిపోతో, తను

05 March 2018

marriage

మాట్లాడుకోలేదు ఇద్దరూ, అస్సలు,
చాలాసేపటి వరకూ:
బయట చీకట్లో గాలి సవ్వడి

లీలగా చలి: నిప్పు రాజేసినట్టు ఒక
చిన్న వెలుతురు,
ఎక్కడో, దూరంగా: ఒకోసారి

దాదాపుగా, చేతికి అందేంతగా, ఇక
ఇద్దరినీ వెలిగించి,
మరి బ్రతికించి ఉంచేంతగా!
***
మాట్లాడుకోలేదు ఇద్దరూ, అస్సలు,
చాలాసేపటి వరకూ:
సమాధిపై పాతిన రాళ్ళలాగా!  

last communication

"ఎవరు నువ్వు? అసలేం కావాలి
నీకు? ఎందుకు
వచ్చావు నువ్వు ఇక్కడికి?"

(the woman in white asked him)

సగంగా తెగిన చేతులనీ, నాలికనీ
చూయిస్తో, శబ్దిస్తో
"గ్ గ్ గ్ గ్ గ్" అని మరి ఏవో

సంజ్ఞలు చేస్తో, మొండి చేతులని
జోడించి, ఆ స్త్రీ
ముందు మోకరిల్లాడు అతను:

పగిలినో పిల్లనగ్రోవి తుది శ్వాసతో
నిస్సహాయతతో
మరి, జీరగా విలపించినట్టు!


ఒకరోజు

ఆకులపై రాలే మంచూ, మసక
వెన్నెల, ఊగే
నీడలూ, చెట్ల కింద చెదిరి

తడిచిన ఎర్రని మట్టి, ఇంటిపై
కుండీలలోని
చామంతులూ, రాసుకుని

రాసుకుని తిరిగే పిల్లులూ, మరి
రెండు బాతు
పిల్లలూ, వాటి అరుపులూ

ఎన్ని ఉన్నాయో తెలుసా, వీడి
కళ్ళల్లో? అంది
తను వాడిని ఒడిలో ఊపుతో -
***
కానీ అప్పటికే, క్వాక్క్వాక్ మంటో
ఈ పొయెమ్తో
ఎటో వెళ్లేపోయాడు అతను!

04 March 2018

గీత

చెరిపిన గీతలా, చీకటిలో
చిన్నగా పొగ
లోపల, దేనికో తగిలి

ప్రాణం చీలిపోయినట్టుగా
బొట్టుబొట్టుగా
నొప్పి. ఆధాటున మరి

ఎంతో ఖాళీ: ( లోపలే )
***
రాత్రి అయ్యింది: అయినా
రాలేదు ఎవరూ!
రాలి కాలిపోయి, ఓ పొగై

చీకట్లో కరిగిపోతో అతనే!


epistemology

మరి తలుపులు తెరచే ఉన్నాయి
లైటు వేయలేదు,
ఇల్లంతా కురిసే మసక చీకటి,

శరీరంలో రాక్షస రాత్రుళ్ళ కేకలు
శ్వాస లేని గాలి. ఇక,
ఇలా అనుకుంటాడు అతను:

వెన్నెల బరువెంతో తెలుసా నీకు?
చీకటంత. నీ అంత,
నిన్ను దాచుకున్న అశ్రువంత! 

cleaning

గదులు అన్నిటినీ శ్రద్ధగా ఊడ్చి
దుమ్ముని అంతా
ఒక పాత వార్తాపత్రికలోకి ఎత్తి

ఆరుబయట ఉన్న ఓ బుట్టలోకి
దులిపి, ఇక ఏదో
ఆలోచిస్తో లోపలికొస్తో ఆవిడ!
***
ఇప్పటికి ఇట్లా నిన్ను విదిలించి
శుభ్రపరచడం
ఎన్నోసారో, మరి నీకు (నీకే)

అస్సలు జ్ఞాపకమే లేదు!

ఎటో

ఒక తెల్లని కాగితం, మరో
ఎర్రని పూవు
( was that a red rose or
a yellow one 
that you've asked for?)

కొంచెం గాలీ, ఇంకా కొంచెం
వానా, దారిన
రాలిన ఒక ఖాళీ గూడూ

దానిలో ఇంకా మ్రోగే ఏవేవో
ప్రతిధ్వనులూ
( was that my heart or
echoes of your
words in my heart? )

ఇవన్నీ, మరివన్నీ కానివి
ఎన్నో, ఏవో
తెచ్చాను నీకోసం: ప్చ్,

కానీ, అప్పటికే నిండుగా
నిద్రలోకి, ఒక
పొగమంచులోకి, నావై

సాగిపోయి ఉన్నావు నీవు! 

02 March 2018

life

గడచిపోయింది రాత్రి: తన నుదిటిపై
ఉంచిన ఒక తెల్లని
రుమాలై, తడిచీ ఆవిరై, ఆవిరై


మళ్ళీ తడిచిపోయీ, రాత్రంతా తాను
జ్వరంతో అలాగే,
రాలిన మొగ్గలాగే, అతని పక్కనే

ఏవో కలవరింతలై, వేసవిలో, ఇంటి
వెనుక ఉంచిన ఒక
కుండ కింద మండే, ఇసుకలాగే!
***
ఉదయం నిదుర లేచిన పిల్లలు ఇక
అతనిని ఇలాగ
అడిగారు:"నాన్నా నాన్నా, రాత్రి

మరి అమ్మకి ఏమయ్యింది నాన్నా?"

ఎటు

ఉదయం: విషం చిమ్మినట్టు మరి
చినుకుల్లో ఎండ,
అప్పటిదాకా మండినదేదో

ఆరిపోతే, చిక్కని పొగ నీ వాసనతో
లోపల నుంచి
పైకి ఎగసీ ఎగసీ ఎగసీ:ఎటో!
***
ఉదయం: కనులలోని ఎండ, ఒక
తెల్లని త్రాచైతే,
హృదయం, నురగలు కక్కే

ఒక రాత్రైతే, ఇక ఎటు పోవడం?


ఆమోదయోగ్యం

"I am sick of you asshole
leave me alone"
she screamed at him,

తెచ్చిన పూలూ, పాలూ మరి
బ్రెడ్డూ మాత్రలూ
మందుల చీటీ, మిగిలిన

చిల్లరా ఇంకా, తెల్లని గులాబీ
రేకులపై చిందిన
ఎర్రని రక్తంవంటి ఎవరిదో

ఒక రహస్య హృదయాన్ని

అక్కడే ఉంచి,చిన్నగా తలుపు
వేసి మౌనంగా
ఇక వెళ్ళిపోయాడు అతను!

ఎలా

నువ్వు లేవు: బాల్కనీలో ఒక
భక్షకియై చీకటి,
చర్మం వొలిచి, నెత్తురు

పిండి అలికినట్టు,  రాత్రి
గాలీ, భూమిపైకి
ఓ డేగవలే వొంగిన నింగీ!

***
ఈ క్షణాన్నిదాటడం ఎట్లా?

సమ్మోహనం

ఎంతో లాలిత్యంగా వికసించే
రాత్రి మొగ్గ,
తన పక్కగా అతను: మరి

ఆ చీకటిని విందామనీ, ఎంతో
లాలిత్యంగా
ఆ రాత్రిని నవ్వుదామనీ!

'అదెలా సాధ్యం?' అని మరి
ఆశ్చర్యంగా
అడుగుతోందా అమ్మాయి,

'ఇట్లా' అని అంటాడు అతను
శిరస్సును,
తన అరచేతులలో వాల్చి!

01 March 2018

తెగి ...

"శ్రీ, కొంచెం హత్తుకోవా నన్ను?"
అడిగింది తను,
వినీ వినిపించని గొంతుకతో,
**
చిన్న గది. మసకగా రాత్రి కాంతి,
మందుల వాసన,
ఏదో అడుగంటిపోయినట్టు,

చిక్కి శల్యమైపోయింది తన శరీరం
ఊడిపోగా ఇక
మిగిలిన జుత్తు, పీచులుగా

గాలికి ఊగినప్పుడల్లా, అతనిలో
ఒక జలదరింపు,
"య్యో దేవుడా,ఏంటిది?"అని
***
"శ్రీ, ఒక్కసారి హత్తుకోవా నన్ను?"
ఎండిన నాలికను
తడుపుకుంటో, మూసుకుపోయే

కళ్ళతో అర్ధించింది తను ...
***
ఇక ఏమీ చేయలేక, అరచేతలలో
ముఖాన్ని కప్పుకుని,
వెక్కివెక్కి ఏడుస్తూ అక్కడే

కూలి పగిలిపోయాడు అతను!

చితికి

చీకట్లో ఒడ్డున రాళ్ళపై
మసక వెన్నెల, 
అలల నురగ: తండ్లాట

ఘోష. అయినా,

వెళ్తూ వెళ్తూ వెనుదిరిగి 
ఒకసారైనా
అతనివైపు చూడలేదు

తాను: ( ఎవరు? ) 

too soon

ఎంతో జాగ్రత్తగా, అరచేతుల మధ్య
నిప్పును తెచ్చి,
చీకట్లో ఒక దీపాన్ని వెలిగించినట్లు

అతనిని దగ్గరగా తీసుకుని, ఎంతో
ఇష్టంగా, మెరిసే
కళ్ళతో, ముద్దు పెట్టుకుంది ఆవిడ! 
***
"ముసలివాళ్ళు" అని వాళ్ళందరూ
నవ్వుకున్నారు
కానీ మరి అత్యంత విలువైనది ఏదో

వాళ్ళకి అప్పుడే ఎట్లా వివరించడం?

nothing much

మారే ఋతువు. గాలికై, శ్వాసకై
తపన. సోలిపోయి
మట్టి. ఇక, అక్కడక్కడే గొంతు

ఎండి తిరుగాడే పావురమొకటి
(అదెవరు? ఎవరది?)
you know, just like this poem!
***
తలుపులు తెరవగానే ఎదురుగా
నువ్వు: కమిలిన
నీ ముఖంలో ఏవో కోతలు.నొప్పి
***
ఇక రాత్రంతా ఏదో బొట్టుబొట్టుగా
రాలే చప్పుడు: పొగ,
నిద్రలో చిట్లే నీ కలవరింతలై!

చిక్కుకుని

గోడకి వేలాడే అద్దం. అటుపక్కగా
బల్లపై దువ్వెన,
రంగురంగుల టిక్లీల పాకెట్

ఒక పౌడర్ డబ్బా. మరి తలుపులు 
తెరిచే ఉన్నాయి, 
తేటగా ఆకాశం. సన్నగా గాలి

ఎక్కడో పక్షి కూస్తోంది. కొమ్మలలో
వాటి నీడల్లో, ఏవో 
కదలికలు: ఆ దువ్వెనలో చిక్కి

ఇక గాలికి కొట్టుకులాడే శిరోజాల్లా! 
***
ప్చ్: ఆ అద్దంలోంచి నిన్ను చూస్తో
ఎవరో ఇక్కడ
నీతో ఒకప్పుడు ఉండే ఉండాలి!

సూచిక

తన అరచేయి అంతా గరకుగా
ఎండిన తాటాకులా,
'ఎందుకిట్లా?' అని అడగబోయి

ఆగిపోతాడు అతను. తలుపుల
వెనుక రాత్రి. గాలీ,
చెట్ల హోరూ. మరిక ఇక్కడ

ఏ క్షణానైనా వర్షం పడవచ్చు!