01 March 2018

తెగి ...

"శ్రీ, కొంచెం హత్తుకోవా నన్ను?"
అడిగింది తను,
వినీ వినిపించని గొంతుకతో,
**
చిన్న గది. మసకగా రాత్రి కాంతి,
మందుల వాసన,
ఏదో అడుగంటిపోయినట్టు,

చిక్కి శల్యమైపోయింది తన శరీరం
ఊడిపోగా ఇక
మిగిలిన జుత్తు, పీచులుగా

గాలికి ఊగినప్పుడల్లా, అతనిలో
ఒక జలదరింపు,
"య్యో దేవుడా,ఏంటిది?"అని
***
"శ్రీ, ఒక్కసారి హత్తుకోవా నన్ను?"
ఎండిన నాలికను
తడుపుకుంటో, మూసుకుపోయే

కళ్ళతో అర్ధించింది తను ...
***
ఇక ఏమీ చేయలేక, అరచేతలలో
ముఖాన్ని కప్పుకుని,
వెక్కివెక్కి ఏడుస్తూ అక్కడే

కూలి పగిలిపోయాడు అతను!

No comments:

Post a Comment