1
ఎర్రని జాబిలి. ఇంకా వేడిగా
ఎంతో వొంటరిగా, అలసినో
చలిస్తో వ్యాపించే, జాడలు;
"నీ ప్రకంపనలు వినిపించే
"a/c యూనిట్ శబ్దానికి ఇక
"మృత్యువుకి చేరువౌతున్న
లేక "సర్పాలై మెలికలుగా
దీపస్థంబాల నీడల భాషవి
ఎలా చెప్పా లి, నా నిన్ను?
3
తెరచిన కిటికీలోంచి వ్యాపించే
అనో, అని మాత్రమే పిలుద్దాం
దీపస్థంబాలు
ఎంతో వొంటరిగా అవి; మరి
ఈ రాత్రిపూట,
వడలిన పూలదండలైతే,
బస్స్టాప్లో, ఒక మూలగా ఇక
కమ్మీకి ఆనుకుని
నువ్వు ; చేతిలో సెల్ఫోన్,
ఎర్రని జాబిలి. ఇంకా వేడిగా
గాలి; నీ ముఖం
నీ శరీరం, తెల్లని కుర్తీలో
ఎంతో వొంటరిగా, అలసినో
పుష్పగుచ్చమైతే,
నీ కళ్ళల్లో, క్రమక్రమంగా
చలిస్తో వ్యాపించే, జాడలు;
అంతంలేని/ కాని
ఈ దీపస్థంబాల నీడలు!
2
ఎట్లా?
ఎట్లా చెప్పాలి?
"నీ ప్రకంపనలు వినిపించే
రాత్రి ఇది మరి"
అని పిలవనా? లేకపోతే
"a/c యూనిట్ శబ్దానికి ఇక
గూడు పోయిన
పిట్టల తండ్లాట" అననా?
"మృత్యువుకి చేరువౌతున్న
అమ్మ కనుల
అలికిడి", అని పిలవనా
లేక "సర్పాలై మెలికలుగా
నేలపైనుంచి
లోపలికి వ్యాపించే ఏవో
దీపస్థంబాల నీడల భాషవి
నువ్వు", అని
సంబోధించనా? ఎలా
ఎలా చెప్పా లి, నా నిన్ను?
3
... అనకు,
ప్రేమ అని అనకు దానిని; ఇక
మరేదో పేరుతోనే
పిలుద్దాం ఇద్దరం; దానినే,
తెరచిన కిటికీలోంచి వ్యాపించే
వొంటరి రాత్రినీ,
బాల్కనీలో రాలిన గూడునీ,
ఖాళీయై తపించే బాహువులనీ
పెంకుల కళ్ళనీ,
మరి ఈ నిస్సహాయ కవితనీ!
***
ప్రేమ అని అనకు దానిని; ఇక
'ఇదే జీవితం' అనో
'అదే నువ్వు, ఇక ఇదే నేను'
అనో, అని మాత్రమే పిలుద్దాం
ఇద్దరమూ దానిని,
రెండు రాళ్లై, మిగిలీ/పోయీ!
No comments:
Post a Comment