24 November 2012

"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."

"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో
     ఎందుకని అడగకు. కొన్నిసార్లు ఇలా
     ఉండదు జీవితం - పూలూ ఆకాశం వానా వెన్నెలా అనంతమైన ప్రేమా

అంతా ఒక అబద్ధం.వాడుకోబడి
రాత్రిలో నడిరోడ్డుపై వొంటరిగా, నువ్వు వదిలివేయబడి
ఆకలయ్యి దాహం అయ్యి ఒక

ఒంటరివై, అంధ బిక్షువై, ఒక
అనాధ ఆశ్రమంకై శరనార్ధియై వెదుక్కోవడమే నిజం. శరీరం నుంచి శరీరానికి
దారీ తెన్నూ లేక తరిమి తరిమి
వేయబడటమే అంతిమ సత్యం:

Do not talk all that, ages of
romantic bull shit with me-
And do not frame me either, fucker": అని ఇక తను నగ్నమయినప్పుడు తన

పాలిండ్లపై, తన నాభిపై తొడలపై
మృగాలు, తమ ఖడ్గ దంతాలతో
తమ నల్లటి పొడుగాటి గోళ్ళతో తనని నింపాదిగా చీరిన నెత్తురు మరకలు
ఎన్నడో ఆవిరయ్యిన కన్నీళ్లు-

ఇక నేను, తనకి ఏమీ చెప్పలేక
ఇక నేను, తనకి ఏమీ అవ్వలేకా
తనని గాట్టిగా కావలించుకుని తొలిసారిగా వెక్కి వెక్కి ఏడ్చాను

"I like this night and
I like this Bacardi rum
Do you?" అని తను నవ్వుతో, కొంచెం మత్తుగా కొంచెం దిగులుగా కొంచెం బాధగా
అడిగిన రాత్రి, నా తల్ల్లులూ
చెల్లెళ్ళూ అక్కలూ అనాది
ఆదిమ స్త్రీలూ ఒక్కసారిగా

ఎందుకో గత జన్మలయ్యీ, పునర్ జన్మలయ్యీ అనంతంగా గుర్తుకువచ్చి- ఎందుకో.       

7 comments:

  1. శ్రీ గుండెను పిండేసేలా రాయడం సహజమైన అనుభూతులని అద్భుతంగా అక్షరీకరించడం నీకే తెలుసయ్యా .....ప్రేమతో ...జగతి

    ReplyDelete
  2. baagundandi ...
    touching feeling / s ...

    ReplyDelete
  3. ఇక నేను, తనకి ఏమీ చెప్పలేక
    ఇక నేను, తనకి ఏమీ అవ్వలేకా
    తనని గాట్టిగా కావలించుకుని తొలిసారిగా వెక్కి వెక్కి ఏడ్చాను

    ReplyDelete
  4. too much disturbing poem. great boss

    ReplyDelete