ఒంటరిగా గదిలో పగలు ఒక్కటే ఒక అమ్మ
వొణికే చేతులు
వొణికే కనులు
వొణికి వొణికి అరచేతులలో రాలిపడే కన్నీళ్లు.
ఇలా కాదు అనుకున్నది
ఇలా కాదు జరగాల్సినది
ఇలా కాదు మరి విరమణ
ఇద్దరు పిల్లలతో రహదారిపై
ఎటు వెళ్ళాలో తెలియక
పమిటెతో కళ్ళు తుడిచి
విసవిసా నడుచుకుంటూ
ఒంటరిగా మండుటెండలో
ఒంటరిగా ఒక్కటే ఒక చెల్లి
నాలికపై ఒక చేదు
గుండెలో ఒక గాటు
వొణికి వొణికి పాదాలలోంచి తొణికే ఒక శోకం
ఇలా కాదు అనుకున్నది
ఇలా కాదు జరగాల్సినది
ఇలా కాదు మరి విరమణ
ఒంటరిగా అనాధై
రాత్రిలో పాకలో మిగిలిన ఒక అమ్మ అమ్మ
ఇక వొణక లేని చేతులు
ఇక వొణక లేని కనులు
వొణికీ వొణికీ వొణికీ ఇక
వొణక లేక భూమికి వొంగి
నింగికి వీపును చూయిస్తూ
చద్ది అన్నంతో చద్ది దేహమై
ఇలా ఎముకలల శిధిలమై
మిగిలిపోయిన అమ్మమ్మ
ఇలా కాదు అనుకున్నది
ఇలా కాదు జరగాల్సినది
ఇలా కాదు మరి విరమణ
అందుకే
ఇక ఇక్కడే ఎక్కడో మరి చీకట్లలో
తడుముకుంటూ
బావురుమంటూ
ఏడుస్తోంది ఒక పిల్లి పిల్ల ఒంటరిగా
కాటుక పూల
పందిరి కింద
ముడుచుకుని
ముడుచుకుని
ముడుచుకుని
తన కుత్తుక పైకి నింపాదిగా
దయ లేక దిగుతున్న
మృగ దంత ఖడ్గాలతో-
మరి
కాటుక పూల కన్నీళ్ళతో
తనని అలా ఒంటరిగా
వొదిలివేసినది ఎవరు?
వొణికే చేతులు
వొణికే కనులు
వొణికి వొణికి అరచేతులలో రాలిపడే కన్నీళ్లు.
ఇలా కాదు అనుకున్నది
ఇలా కాదు జరగాల్సినది
ఇలా కాదు మరి విరమణ
ఇద్దరు పిల్లలతో రహదారిపై
ఎటు వెళ్ళాలో తెలియక
పమిటెతో కళ్ళు తుడిచి
విసవిసా నడుచుకుంటూ
ఒంటరిగా మండుటెండలో
ఒంటరిగా ఒక్కటే ఒక చెల్లి
నాలికపై ఒక చేదు
గుండెలో ఒక గాటు
వొణికి వొణికి పాదాలలోంచి తొణికే ఒక శోకం
ఇలా కాదు అనుకున్నది
ఇలా కాదు జరగాల్సినది
ఇలా కాదు మరి విరమణ
ఒంటరిగా అనాధై
రాత్రిలో పాకలో మిగిలిన ఒక అమ్మ అమ్మ
ఇక వొణక లేని చేతులు
ఇక వొణక లేని కనులు
వొణికీ వొణికీ వొణికీ ఇక
వొణక లేక భూమికి వొంగి
నింగికి వీపును చూయిస్తూ
చద్ది అన్నంతో చద్ది దేహమై
ఇలా ఎముకలల శిధిలమై
మిగిలిపోయిన అమ్మమ్మ
ఇలా కాదు అనుకున్నది
ఇలా కాదు జరగాల్సినది
ఇలా కాదు మరి విరమణ
అందుకే
ఇక ఇక్కడే ఎక్కడో మరి చీకట్లలో
తడుముకుంటూ
బావురుమంటూ
ఏడుస్తోంది ఒక పిల్లి పిల్ల ఒంటరిగా
కాటుక పూల
పందిరి కింద
ముడుచుకుని
ముడుచుకుని
ముడుచుకుని
తన కుత్తుక పైకి నింపాదిగా
దయ లేక దిగుతున్న
మృగ దంత ఖడ్గాలతో-
మరి
కాటుక పూల కన్నీళ్ళతో
తనని అలా ఒంటరిగా
వొదిలివేసినది ఎవరు?
No comments:
Post a Comment