అస్సలు మాట్లాడకు
పూవు ఒకటి తూగుతోంది కొలనులో
క్షణాలసలే లెక్కించకు
పసినవ్వు ఒకటి వెలుగుతోంది గదిలో
తలవకు అసలే మరి
సీతాకోకచిలుకలు తిరిగే ఈ తోటలో
తాకకు అసలే మరి
ఆ చేతివేళ్లు చిన్నగా
ముడుచుకునే వేళల్లో
కలల రంగులు కమ్మగా పూచే లోకాల్లో
కనులు మరో లోకంలోకి జారే కాలాల్లో
సవ్వడే చేయకు
ష్......అంతా నిశ్శబ్దం
శ్వాస కూడా తీయకు
పాప నిద్దుర పోతోంది.
పూవు ఒకటి తూగుతోంది కొలనులో
క్షణాలసలే లెక్కించకు
పసినవ్వు ఒకటి వెలుగుతోంది గదిలో
తలవకు అసలే మరి
సీతాకోకచిలుకలు తిరిగే ఈ తోటలో
తాకకు అసలే మరి
ఆ చేతివేళ్లు చిన్నగా
ముడుచుకునే వేళల్లో
కలల రంగులు కమ్మగా పూచే లోకాల్లో
కనులు మరో లోకంలోకి జారే కాలాల్లో
సవ్వడే చేయకు
ష్......అంతా నిశ్శబ్దం
శ్వాస కూడా తీయకు
పాప నిద్దుర పోతోంది.
బాగుందండి
ReplyDelete