నువ్వా రాత్రి నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు
నీ నోరంతా చిక్కగా కాగిన బెల్లం వాసనా, మరి కొంత అగ్నీనూ.
ఊపిరాడక గించుకుని, నీ చేతుల్లోంచి తప్పించుకుని వెనకకి
వాలి శ్వాస తీసుకుంటుంటే పడీ పడీ నవ్వుతావు కదా నువ్వు
అప్పుడు ఆ నా చిన్ని గదిలో, మబ్బులూ పిచ్చిగా ఊగే చెట్లూ
దుమ్మూ దుమారమూ, మరి సన్నగా మొదలయ్యే తుంపరానూ.
"భయపడ్డావా" అంటూ తెగిన పెదాల పైనుంచి నెత్తురిని మెత్తగా నీ
తెల్లటి దుప్పట్టాతో తుడిచినా, నా లోపలి వొణుకు ఆగదు.
'మండుతుంది' అని అంటాను, నొప్పిగా ముఖం పెట్టి. మరి మళ్ళా
నవ్వుతో అంటావు కదా నువ్వు: "మరి, వొద్దూ వొద్దు అంటుంటే
నాకు మందు తాగించింది ఎవరు? ఇలా దగ్గరికి రా. కొరకనులే
ఈ సారి. భయపడకు" అంటూ మళ్ళా తనే, నన్ను జాగ్రత్తగా
తన తల్లితనపు పాలిండ్లలో పొదుపుకుని: ఇక అలా వెచ్చగా ఒదిగి
తన చుట్టూ చేతులు వేసి, తనని గాట్టిగా పట్టుకుని
ఆ చీకట్లలో నా ముఖం దాచుకుని, అలా పడుకుని
బయట కురిసే వాననీ, తన శరీరంలోని ప్రవాహాన్నీ
వింటుంటే అడుగుతుంది తను, స్ఖలించినంత హాయిగా:
"I like this night and
I like this Bacardi Rum.
Do you?"
Good one..
ReplyDeleteEntha naatu premo.. emi inapa lavvoo.. :)
ReplyDelete