ఆమె నవ్వడాన్ని, తరచూ చూడవు నువ్వు.
వంటలో నిమగ్నమై, హటాత్తుగా తల ఎత్తి
మసి అంటిన అరచేతితో తన
ముఖాన్ని తుడుచుకుంటూ
నీ వైపు చూసి ఆప్రయత్నంగా నవ్వుతుంది తను.
మరి ఇకా
తరువాతా, ఆ రాత్రి అంతా
మండుతూనే ఉండింది ఆ
కట్టెల పొయ్యి అప్రతిహతంగా, ఉజ్వలంగా-
చివరికి నువ్వొక్కడివే ఆ నిప్పుల ముందు
అక్కడ: చీకట్లో- నింగిలోకి ఎగిసే
ఒక తెల్లని పొగవై- మిగిలిపోయి.
వంటలో నిమగ్నమై, హటాత్తుగా తల ఎత్తి
మసి అంటిన అరచేతితో తన
ముఖాన్ని తుడుచుకుంటూ
నీ వైపు చూసి ఆప్రయత్నంగా నవ్వుతుంది తను.
మరి ఇకా
తరువాతా, ఆ రాత్రి అంతా
మండుతూనే ఉండింది ఆ
కట్టెల పొయ్యి అప్రతిహతంగా, ఉజ్వలంగా-
చివరికి నువ్వొక్కడివే ఆ నిప్పుల ముందు
అక్కడ: చీకట్లో- నింగిలోకి ఎగిసే
ఒక తెల్లని పొగవై- మిగిలిపోయి.
No comments:
Post a Comment