ప్రతి ఉదయాన్నే, ఇళ్ళలోంచి గోడలకు పైగా రోడ్డు పైకి వాలిన కొమ్మలకి పూసిన పూలను తెంపుకునేందుకు వస్తారు ఒక ముసలావిడా, తన మనవరాలూ ప్రతి రోజూ ఒక పూలబుట్టతో. ఆ లేత పొగమంచంతా ఆ పిల్ల మాటల సవ్వడకి కాబోలు రెక్కలు విదుల్చుకుని తటాలున ఎగిరే పోతుంది. తను పట్టుకున్న ఆ ముసలి తల్లి అరచేతి వెచ్చదనానికి కావొచ్చు, మరి తూర్పున కొంత తొందరగానే సూర్యోదయం.
ఏమిటంటే, తెంపుకునే ఆ పూవులు పూజకు కావచ్చు. ఏ దైవ పాద సన్నిధికో కావొచ్చు . వాకిలికి కట్టు కునేందుకు కావొచ్చు. తలలో అలంకరించుకునేందుకు కావొచ్చు. దేనికీ, ఎవరికీ కాకపోవొచ్చు.
దేనికో, ఎందుకో నీకు తెలియదు కానీ, వాళ్ళను చూస్తూ ఇక మరి అక్కడే నిస్సహాయంగా నువ్వు నీలో మునిగీ దారీ తెన్నూ మరచి. మరి ఇక ఈ దినానికల్లా నీ ఆశ ఏమిటంటే, ఆ కొమ్మని వొంచినట్టు ఎవరో నిన్ను తేలికగా వొంపి, మెత్తగా తుంపి నిన్ను పూజకు అర్హత కావిస్తారనీ, నీ పద సన్నిధికి నిన్నే ఎవరో అంతిమంగా సమర్పిస్తారనీ.
మరి ఇకా తరువాత ఏం జరుగుతుందని అడగకు నువ్వు, నిన్ను తను తన తనువు బుట్టలో దాచుకుని నుదుట బొట్టుతో వొంటరిగా కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళే దారిలో-
మరి ఇకా తరువాత ఏం జరుగుతుందని అడగకు నువ్వు, నిన్ను తను తన తనువు బుట్టలో దాచుకుని నుదుట బొట్టుతో వొంటరిగా కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళే దారిలో-
No comments:
Post a Comment