చీకట్లో నీ ముఖం తెలియదు
నా వేళ్ళ చివర్లకి తడి మాత్రం తగులుతుంది
నా ఛాతికి నీ హృదయ వేదన తెలియదు. నీ
ఊపిరిని తాకిన నా శ్వాసే కమిలి పోతుంది
ముడుచుకున్న నీ రెండు అరచేతులు -అలానే-
గూడు లేని గుప్పెడు ఆశా లేని నా ఈ రెండు అరచేతులలో:
ఇక ఈ దినమంతా, మన ముఖాలపైకి
ఎవరో నిర్లిప్తంగా లాగిన ఒక శ్వేత వస్త్రం.
అక్కడే, మన ముందుగానే
ఆరుబయట నీడలలోనే
ఒక ఒంటరి గడ్డి పూవు రాలిపోయింది యిప్పుడే. చూడు
నిన్ను చూసీ చూసీ చెమ్మగిల్లి
ఎలా ఈ అద్దం పగిలిపోయిందో-

No comments:
Post a Comment