గడప లేని ఒక రాత్రిని ఇలా గడపవచ్చు నువ్వు:
అనేక హస్తాలూ, అనేక నయనాలూ నీలో జనినించి
వీచే గాలీ, రాలే పూలూ ఎగిరే
సీతాకోకచిలుకలూ కలవరంగా
కదిలే చెట్లూ, చెమ్మలాగా
పొరలాగా నీ పైనుంచి అలుముకునే చీకటి కాంతీ
ఇవేమీ బయట లేవనీ, అన్నీ నీలోంచి వెలుపలికి
ప్రసరిస్తున్నాయనీ
వాకిళ్ళు లేని ఇంటిలో కూర్చుని తెలిసిననాడు
నీతో చల్లగా, తోడుగా అమృత
మయమై ఒక మధుపాత్రా ఓ
చిన్ని గిన్నెలో పాత పచ్చడీ
మరి చీకట్లో నువ్వు ఇష్టంగా వెలిగించుకుని అర
చేతులలో దాచుకున్న, వొత్తి చివరన ఎగిసే
తన శరీరమంత తెల్లని పసుపు మంటానూ-
మరి ఇక నీ స్నానాల గదిలో తను అద్ది మరచిన
ఒక ఎర్రని టిక్లీ నెత్తురు మరకలా అద్దంపై కాలంతో
కరిగి రంగు వెలసి, చివరికి
ఒక శ్వేత మృతస్పటికంలా
నిన్నొక సూక్ష్మ కేంద్రాన్ని చేసి నలుదిశలా ఎలా
వెదజల్లుతుందో - చూడు.

No comments:
Post a Comment