తెల్లటి కాగితంపై ఒక వాక్యం రాసి, చివర ఒక బిందువుని ఉంచాడు అతను. అప్పుడు
తను అంది అతనితో: అది అంత తేలిక కాదు. నీకు తెలుసా, వాక్యంత బిందువుని
ఒక వాక్యం ఎలా చూస్తుందో?
అతను తన బల్లని వదిలి, తలుపు వద్దకు ఒక విరామ చిహ్నమై కదిలేటప్పటికి
బల్లపై -రాసుకున్న కాగితాలపై- ఉంచిన పూలపాత్ర
తన నయనం వద్ద వాక్యంత బిందువుగా మారింది-

No comments:
Post a Comment