చాలు. మాట్లాడకు.
మోకాళ్ళపై ఒరిగి వినమ్రతతో
భూమిని తాకిన నుదిటినీ
శ్వాసకి నింగికి ఎగిరిన
ధూళినీ కదపకు.
సాయంత్రం అయ్యింది. రాత్రీ అయ్యింది.
చీకటిని హత్తుకుని
ఒక పూవు నేలనూ
చీకటి గాలినీ కప్పుకుంది.
లేని వెన్నలని తలవకు.
ఇతరుల నెలవంకలపై ఆగకు.
తప్పుకో:చల్లటి నిశ్శబ్ధమై
పడుకుంటావు నిర్మలంగా
నీతో నువ్వు
నీలో నువ్వు: చూడు
రెక్కలు విప్పార్చి
రాత్రి మంచు పచ్చికపై ఆగి ఉంది
తారకల మచ్చలతో
ఒక ఒంటరి సీతాకోకచిలుక.
మోకాళ్ళపై ఒరిగి వినమ్రతతో
భూమిని తాకిన నుదిటినీ
శ్వాసకి నింగికి ఎగిరిన
ధూళినీ కదపకు.
సాయంత్రం అయ్యింది. రాత్రీ అయ్యింది.
చీకటిని హత్తుకుని
ఒక పూవు నేలనూ
చీకటి గాలినీ కప్పుకుంది.
లేని వెన్నలని తలవకు.
ఇతరుల నెలవంకలపై ఆగకు.
తప్పుకో:చల్లటి నిశ్శబ్ధమై
పడుకుంటావు నిర్మలంగా
నీతో నువ్వు
నీలో నువ్వు: చూడు
రెక్కలు విప్పార్చి
రాత్రి మంచు పచ్చికపై ఆగి ఉంది
తారకల మచ్చలతో
ఒక ఒంటరి సీతాకోకచిలుక.
No comments:
Post a Comment