ఎదురెదురుగా కూర్చున్నారు ఇద్దరు, నీలి వస్త్రం వలే
కమ్ముకునే రాత్రిలో: తమ ఆఖరి శ్వాసతో ఒక నీలి దీపాన్ని వెలిగించి
ఈ ఒక్క చీకటి కాలానికీ, లోకానికీ
తాము బ్రతికున్నామని అత్యంత సున్నితమైన
ధృడమైన సంకల్పంతో చెప్పేందుకా అన్నట్టు-
ఇక ఆ తరువాత, అనంతకాలాల మౌనం తరువాత
అతడు అన్నాడు: "అమ్ములూ, ఇంత అన్నం పెట్టు
ఆకలి వేస్తోంది."

No comments:
Post a Comment