చల్లటి నీడలలో, వానకి పిచ్చిగా తడిచిన
గుల్ మొహర్ పూల చెట్లు
ఎర్రెర్రని పూలని పకాల్మని
ఒక నవ్వుతో పడకపైనంతా
విరజిమ్ముతాయి-
అవే, నెత్తురు ఎగతన్నుకు వచ్చి
మెత్తగా విచ్చుకుని నిన్నుగట్టిగా
తమలోకి లాక్కుని వాటేసుకునే
ఆ పిచ్చి గుల్ మొహర్ పుష్పాలు
నిన్ను ఎప్పుడూ ఏమీ అడగని
పుష్పాలు, నిన్ను వదలలేని
నీకు అర్ధం కాని ఎర్రని వెన్నెల
పుష్పాలు. నీ మెలుకువలో నీ
నిద్రలో జ్వలిచే పుష్పాలు-
ఇక అందుకే ఆ రాత్రంతా, అతనిలో
ఒక అడవీ, ఒక సముద్రమూ
గుల్ మొహర్ పూల చెట్లు
ఒక్కసారిగా వీచిన గాలికి
తనువులు జలదరించి ఇక
తనువులు జలదరించి ఇక
ఎర్రెర్రని పూలని పకాల్మని
ఒక నవ్వుతో పడకపైనంతా
విరజిమ్ముతాయి-
అవే, నెత్తురు ఎగతన్నుకు వచ్చి
మెత్తగా విచ్చుకుని నిన్నుగట్టిగా
తమలోకి లాక్కుని వాటేసుకునే
ఆ పిచ్చి గుల్ మొహర్ పుష్పాలు
నిన్ను ఎప్పుడూ ఏమీ అడగని
పుష్పాలు, నిన్ను వదలలేని
నీకు అర్ధం కాని ఎర్రని వెన్నెల
పుష్పాలు. నీ మెలుకువలో నీ
నిద్రలో జ్వలిచే పుష్పాలు-
ఇక అందుకే ఆ రాత్రంతా, అతనిలో
ఒక అడవీ, ఒక సముద్రమూ
ఒక ఇప్పపూల వానా మరి
ఒక ఆదిమ బలిదానమూనూ-
No comments:
Post a Comment