నా చేతిలో ఒక భిక్షాపాత్ర.: అది నేనే.
అది ఖాళీ: మరి దాని నిండా
ధ్వని లేని ప్రతిధ్వని నువ్వు
తల వంచి చూస్తే
ఉంటాయి దానిలో
లోతు లేని నీళ్ళు: బహుశా
అడుగున, నువ్వు చూడని
గులక రాళ్ళు.
మరి నువ్వు తొంగి చూసినప్పుడు
ఆ వలయపు లోతుల్లో
వలయాలవుతూ నీకు
కనిపించిన ముఖం, ఎవరిది?
అది ఖాళీ: మరి దాని నిండా
ధ్వని లేని ప్రతిధ్వని నువ్వు
తల వంచి చూస్తే
ఉంటాయి దానిలో
లోతు లేని నీళ్ళు: బహుశా
అడుగున, నువ్వు చూడని
గులక రాళ్ళు.
మరి నువ్వు తొంగి చూసినప్పుడు
ఆ వలయపు లోతుల్లో
వలయాలవుతూ నీకు
కనిపించిన ముఖం, ఎవరిది?
chaalaa baavundi
ReplyDelete