05 March 2018

ఒకరోజు

ఆకులపై రాలే మంచూ, మసక
వెన్నెల, ఊగే
నీడలూ, చెట్ల కింద చెదిరి

తడిచిన ఎర్రని మట్టి, ఇంటిపై
కుండీలలోని
చామంతులూ, రాసుకుని

రాసుకుని తిరిగే పిల్లులూ, మరి
రెండు బాతు
పిల్లలూ, వాటి అరుపులూ

ఎన్ని ఉన్నాయో తెలుసా, వీడి
కళ్ళల్లో? అంది
తను వాడిని ఒడిలో ఊపుతో -
***
కానీ అప్పటికే, క్వాక్క్వాక్ మంటో
ఈ పొయెమ్తో
ఎటో వెళ్లేపోయాడు అతను!

No comments:

Post a Comment