"my white white lily, చూడు ఇటు
don't be afraid,
you're still so beautiful"
అని అన్నాడు అతను: ఎముకలైన చేతులను
అతని మెడ చుట్టూ
వేసి, కృంగిన కళ్ళని అతని
ఛాతిలో పాతుకుని, నెత్తురు పూచే ఒక మొక్కై
మొలకెత్తుతో,
పెద్దగా ఏడ్చింది తను: తెగి
ఉబికే గొంతుకతో, వొణికే శరీరంతో హత్తుకుని
ఏదో చెప్పాలనీ
చెప్పలేక,వొదలలేక మరిక
ఓ ఐదడుగుల అశ్రువై, రాలి చిట్లి చెదిరిపోతో
చీకటి కమ్మిన
తెల్లని రాత్రుళ్ళలో, నొప్పితో
రేకు రేకుగా వీడిపోతో, తను!
don't be afraid,
you're still so beautiful"
అని అన్నాడు అతను: ఎముకలైన చేతులను
అతని మెడ చుట్టూ
వేసి, కృంగిన కళ్ళని అతని
ఛాతిలో పాతుకుని, నెత్తురు పూచే ఒక మొక్కై
మొలకెత్తుతో,
పెద్దగా ఏడ్చింది తను: తెగి
ఉబికే గొంతుకతో, వొణికే శరీరంతో హత్తుకుని
ఏదో చెప్పాలనీ
చెప్పలేక,వొదలలేక మరిక
ఓ ఐదడుగుల అశ్రువై, రాలి చిట్లి చెదిరిపోతో
చీకటి కమ్మిన
తెల్లని రాత్రుళ్ళలో, నొప్పితో
రేకు రేకుగా వీడిపోతో, తను!
No comments:
Post a Comment