08 March 2018

ఏదో

కనులు తెరచిన వెంటనే, ఎదురుగా
నీ కళ్ళు,
వాన కురిసే సాయంత్రాలై,

ఏం జరిగింది? అడుగుతాను చిన్నగా
ఇక, ఏదో
అలజడిని నింపుకుని ఊగే

ఆ చెట్లనీ గూళ్ళనీ మెడలు మాత్రమే
బయట పెట్టి
చూసే రెండు నల్లని పిట్టల్నీ!

వాటిదంతా కూడా చెట్ల భాష. రెక్కల
భాష: గాలి భాష,
ఊగే నీడల తెల్లని రాత్రి భాష,

ఒడ్డు నుండి ఒడ్డుకు అలలుగా కదిలే
సరస్సుల భాష,
ఆ నీటి శబ్దాల రహస్య భాష!
***
కనులు తెరచిన వెంటనే, ఎదురుగా
నీ కళ్ళు,
వాన కురిసే నల్లని రాత్రులై

ఏమీ చెప్పక, అసలేమీ అనక! 

No comments:

Post a Comment