ఎంతో లాలిత్యంగా వికసించే
రాత్రి మొగ్గ,
తన పక్కగా అతను: మరి
ఆ చీకటిని విందామనీ, ఎంతో
లాలిత్యంగా
ఆ రాత్రిని నవ్వుదామనీ!
'అదెలా సాధ్యం?' అని మరి
ఆశ్చర్యంగా
అడుగుతోందా అమ్మాయి,
'ఇట్లా' అని అంటాడు అతను
శిరస్సును,
తన అరచేతులలో వాల్చి!
రాత్రి మొగ్గ,
తన పక్కగా అతను: మరి
ఆ చీకటిని విందామనీ, ఎంతో
లాలిత్యంగా
ఆ రాత్రిని నవ్వుదామనీ!
'అదెలా సాధ్యం?' అని మరి
ఆశ్చర్యంగా
అడుగుతోందా అమ్మాయి,
'ఇట్లా' అని అంటాడు అతను
శిరస్సును,
తన అరచేతులలో వాల్చి!
No comments:
Post a Comment