మరి తలుపులు తెరచే ఉన్నాయి
లైటు వేయలేదు,
ఇల్లంతా కురిసే మసక చీకటి,
శరీరంలో రాక్షస రాత్రుళ్ళ కేకలు
శ్వాస లేని గాలి. ఇక,
ఇలా అనుకుంటాడు అతను:
వెన్నెల బరువెంతో తెలుసా నీకు?
చీకటంత. నీ అంత,
నిన్ను దాచుకున్న అశ్రువంత!
లైటు వేయలేదు,
ఇల్లంతా కురిసే మసక చీకటి,
శరీరంలో రాక్షస రాత్రుళ్ళ కేకలు
శ్వాస లేని గాలి. ఇక,
ఇలా అనుకుంటాడు అతను:
వెన్నెల బరువెంతో తెలుసా నీకు?
చీకటంత. నీ అంత,
నిన్ను దాచుకున్న అశ్రువంత!
No comments:
Post a Comment