మరి, ఎంతో ఘాడంగా కమ్ముకునే
ఉన్నాయి మబ్బులు,
పొరలు పొరలుగా వీచే గాలి,
ఉన్నట్టుండీ ఉరిమే సవ్వడి; మరి
ఈ మసక కాంతిలో
చెమ్మగిల్లిన ఈ వెలుతురులో ...
చినుకులు రాలే చప్పుడేనా అది?
ఆకులు వణికి, పూలు
ఇక, తలలు వాల్చే కాలమేనా,
ఇది? సాగలేక ఇక ఏ చెట్టు కిందో
చేరి, వొరిగి, కళ్ళు
చికిలించి చూస్తో, ఇక ఎవరినో
తలుస్తో, కనులు మూయవలసిన
క్షణం ఆసన్నమైన,
మలి దశా, లోకమిదేనా మరి?
***
మరి, ఎంతో ఘాడంగా కమ్ముకునే
ఉన్నాయి మబ్బులు;
వాన కురవకనే, లోపలంతా
ఆకులు రాలి,
తడచిపోయీ!
No comments:
Post a Comment