బహుశా ఎవరూ రారు; ఈ పాతఫాను
ఒక్కటే, తిరుగుతో;
అలసిన శబ్దం దాని రెక్కల్లో,
వేడిమి; పొయ్యి ఆరిపోయాక మిగిలే
బొగ్గు కణికెల్లాంటి
చీకటి; ఆరినా ఇంకా కాలిపోతో,
బయట, బాల్కనీలో గులాబీ మొక్క
పగిలిన పెదాలైన
ఆకులతో వడలే ఉండవచ్చు,
నీళ్ళు లేక మట్టిముంత వద్ద ఎంతో
తచ్చాట్లాడి, మరి
పిట్టలు ఎగిరిపోయే ఉండవచ్చు
ఆకాశం ఎండిన సరస్సై , పగుళ్లిచ్చి
అట్లా నోరు చాచి,
ఓ శిశువై గుక్కపట్టే ఉండవచ్చు!
***
రూఢీగా ఎవ్వరూ రారు; ఇక, కర్టెన్లే
ఈ వొంటరి గదిలో,
రెక్కలు తెగిన సీతాకోకచిలుకలై
రెక్కలు తెగిన సీతాకోకచిలుకలై
కొట్టుకులాడీఆడీఆడీ, ఆగిపోయి!
No comments:
Post a Comment