నేను ప్రయాణిస్తాను, ఈ చీకటిలో నీ దేహపు నిరాకార కాంతితో
నేను ప్రయాణిస్తాను
నువ్వు: గాలిలో అలా ఆగిపోయి సర్వాన్నీ తనలో ఇముడ్చుకునే వర్షపు చినుకువి.
నేను: నా అరచేతులలో భద్రంగా పోదుపుకునే శిశువు నీ ఊపిరి.
నువ్వూ ప్రయాణిస్తావు ఈ చీకటిలో, కనిపించని పుట్టుమచ్చ విదిల్చే
నిరాకార కాంతిలో, జీవితం అనబడే ఈ గాయంలో
No comments:
Post a Comment