08 August 2010

అతడు. ౧.

దయగా గమనించే తెగిన చందమామ అయినా లేక చీకట్లో ఒంటరిగా ఈ నగర రహదారులలో
వెదుకులాడుకుంటూ నడవటం అన్నది ఈ జీవితపు మృత్యువులో మృత్యువై
నువ్వు అతడికి ఇచ్చిన బహుమతి. దయగా తాకే స్త్రీ తెగిన స్పర్శ అయినా లేక రాత్రి ఒంటరిగా
నిదురించడం అన్నది ఈ జీవితపు శూన్యంలో శూన్యమై నువ్వు ప్రేమతో అతడికి ఇచ్చిన బహుమతి.

అయ్యా ఒక కవి తన కవితను రమిస్తూ ఉండటం, నర్తకిని నృత్యంనుంచి వేరుగా చూడలేకపోవడం
పూవుని దాని సౌందర్యాన్ని భద్రపరిచేందుకు తుంపడం, అస్తిత్వపు
ఆనందానికై నిరంతరం గాయపడుతూ ఉండటం అనేది

అయ్యా ఇవన్నీ యాత్రికుడి మూర్ఖత్వపు అదృష్టం: ఇవన్నీ అతడికి ఎంతగా అవసరమంటే

సాయంత్రపు పరిమళాన్ని గదిలో నింపిన మధువు నయనాలలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ
సుదూరపు సమయం అయిన ఇప్పటి సమయంలో ఒక ఆత్మహత్యను ఊహించుకుంటూ
అతడు కళ్లపై అరచేతుల్ని గూళ్ళలా అమర్చుకుని నెమ్మదిగా కనులు మూసుకుంటాడు. ఇక

ఈ దినానికి అతడు ఒక శిశువు కలలో మరనిన్చెందుకు సిద్ధపడతాడు.

No comments:

Post a Comment