06 August 2010

మృత్యుగులాబీ వికసించిన రాత్రిలో

మృత్యుగులాబీ వికసించిన రాత్రిలో గుంపుగా పిల్లలు పాటలు పాడతారు. దేవుని బిడ్డలు మృతగులాబీ ముందు మోకరిల్లి హృదయాలలోని దు:క్ఖిత జలాన్ని రాలిన తల్లిగులాబీపై వంపుతారు 

గాయపడిన నీరు అది. గాయపడిన ప్రేమ అది. గాయపడిన మది అది. రాలిపోయిన తల్లి గులాబీపై రాలిపడి, తల్లి లేని మిత్రుడి పాదాల వద్ద భూమిలోకి సోలిపోతుంది. ఇక పదాలు ఈ రాత్రికి జాబిలీ గులాబీ లేని ఆకాశంలో చనిపోయిన తల్లిని చూపే నక్షత్రాలుగా మారతాయి 

మేరీ మాత మరణించిన మృత్యుగులాబీ వికసించిన రాత్రిలో ఈ లోకం మరొకసారి తల్లిలేని మొగ్గ అయ్యింది. స్నేహితుడా, ఇక రేపటి రాత్రి నుండి నువ్వు తల్లి ఇల్లు లేక ఎక్కడకు వెడతావు? ఎక్కడ రోదిస్తావు? ఏ స్త్రీ తనపు పాలిండ్లపై నిదురిస్తావు?

No comments:

Post a Comment