08 August 2010

నీ పచ్చదనం

నీ పచ్చదనం 
మిణుగురు పాటలా తన కాంతి రెక్కలని 
విప్పుతోంది -

నీకు తెలుసు, ఎదురు చూసే స్త్రీ నయనం ఒక మృత్యువు: రాత్రి, నువ్వు అంటావు, మరణించినవాళ్ళ దు:ఖాన్ని మోస్తుందని. వాళ్ళు మళ్ళా వికసిస్తారా, నేను అడుగుతాను, వాళ్ళు మళ్ళా శరీరాలు కలిసే చోట శభ్దిస్తారా? నిలువెత్తు చంద్రకాంతి కింద రమిస్తారా? వాళ్ళు మళ్ళా మన కనుపాపలపై తమ ప్రతిబింబాల నగిషీలను చెక్కుతారా? తమలో మనలని కంటారా? మనలో తమల్ని వింటారా?

నీకు తెలుసు, ఎదురు చూసే స్త్రీ నయనం ఒక మృత్యువు. సుదూరపు బాటసారికి అది దారి చూపే భిక్షువు. ఇక

నీ వక్షోజాల పచ్చదనం
చీకటి గదిలోని రెండు ప్రమిదెల్లా తన శూన్యపు రెక్కలని 
నా వైపు చాపుతోంది!

No comments:

Post a Comment