07 August 2010

నయనం

అంతరాలలో ఎక్కడో పాతిపెట్టబడి, మట్టి పొరల్లోంచి గమనిస్తూ

విరిగిన ఎముకలనూ నరకబడ్డ తలలనూ ప్రతిబింబించే
ఈ ఆకాశం ఎవరి స్వప్నం

మట్టిపోరాలలో ఎక్కడో పాతిపెట్టబడి నా కనులలోంచి గమనిస్తూ
స్వప్నానికి ముందూ తరువాతా
ఎవరి మరణం నా నయనం ఎవరి జననం నా నయనం

అంతర్లోకాలలో ఎక్కడో పాతిపెట్టబడి ఆకాశంలోంచి గమనిస్తూ
మృత్యువుకి ముందూ తర్వాతా
ఎవరి స్వప్నం నా నయనం ఎవరి వాస్తవం నా నయనం

అంతరాలలో ఎక్కడో పాతిపెట్టబడి ఆకాశమంతా వ్యాపింపబడి
మృత్యు ప్రార్ధనయిన, ఆదీ అనంతం అయిన
ఎవరి తీరని తపన నా నయనం, ఎవరి తీరని శాంతి నా నయనం

No comments:

Post a Comment