ఎవరూ తాకని ఈ దు:ఖపు ముత్యాలు ఎడారిలో కోల్పోయిన చందామామలు
ఎవరూ తాకని ఈ దినాలు ఎన్నటికీ అంతం కావు, నువ్వు అంటావు
అవరూ కోరని ఈ దినాలూ, అలసిన దారుల ధూళితో సొలసిన నయనాలూ
ఎవరూ కంచాని ఈ సమాధులూ ఎన్నటికీ అంతం కావు, నువ్వు అంటావు
ఎవరూ తాకని ఈ దు:ఖపు ముత్యాలు, ఎడారిలో రాలిపోయిన సీతాకోకచిలుకలు
సంధ్యవేళ బాటసారుల నిశ్సభ్దాలలో కలగలిసిపోయిన పాటవి నీవు, నేను అంటాను
రాత్రివేళ కురిసిన వర్షపు చినుకులలో వోదిగిపోయిన దీపపు కాంతివి కూడా నీవు
ఎవరూ తాకని ఈ దు:ఖపు ముత్యాలు, ఎడారిలో స్పృహ తప్పిన నీ పెదాలు
మరెక్కడో పిగిలిపోయి, మరెక్కడో ప్రేమించబడి, ఇక ఇక్కడే ఈ దినాలను
కొనసాగిస్తూ, మృత్యు పదాల మధ్య గూటిని అల్లుకుంటూ, నీకు తెలుసు
ఎవరూ తాకని ఈ దు:ఖపు ముత్యాలు ఎడారిలో కోల్పోయిన చందామామలు
No comments:
Post a Comment