నువ్వొక బాటసారివి, నువ్వొక కాందిశీకుడివి
ఆహ్వానించిన ప్రదేశాలలో ఆగిపోతావు నువ్వు. ఎవరైనా అన్నం పెడితే తిని రాత్రిపూట,
నిన్ను హత్తుకునే చెట్టుని కావలించుకుని విశ్రమిస్తావు నువ్వు.
వీచే గాలీ, ఎవరూ లేని నక్షతాలూ, వొదిలి వేసిన వీధులు మాత్రమే నీ స్నేహితులు.
సాలీళ్ళతో, గబ్బిలాలతో, నిదురించని పక్షులతో మాత్రమే మాట్లాడతావు నువ్వు.
నువ్వొక బాటసారివి, నువ్వొక కాందిశీకుడివి
నీ రెండు కాళ్ళ నీలి కాంతిలో నీ మరణం. అలసటగా వాలిపోయిన నీ బాహువులలో ఒక
స్త్రీ చేసిన గోరువెచ్చటి గాయపు జ్ఞాపకం. ప్రేమ, దయా, మమకారం
మరో ప్రపంచం నుంచి రాలిపడిన అపరాచిత పదాలు. నువ్వు ఇక ఎప్పటికీ తాకలేని
స్వర్గలోకపు దారులు నువ్వు మరచిన నీ తల్లి వక్షోజాలు.
నువ్వొక బాటసారివి, నువ్వొక కాందిశీకుడివి
నువ్వు ఈ పూట చనిపోయినా ఆపే వాళ్ళెవరూ లేరు, నువ్వు ఈ పూట చనిపోయినా
మారేదేమీ లేదు. నువ్వు, ఒక నువ్వు
నువ్వొక బాటసారివి, నువ్వొక కాందిశీకుడివి.
This comment has been removed by the author.
ReplyDelete