వెలిగించిన దీపం చుట్టూ గుండ్రటి కాంతి సరస్సు
నువ్వు లేవు కనుక
సరస్సులో నా ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటాను
ఎవరో వొదిలి వెళ్ళిన నీడలను
జాగ్రత్తగా తాకుతాను
గుమ్మానికి అవతలగా రాత్రి. రాత్రికి అవతలగా
నేను రాసుకునే
ఎప్పటికీ నీకు చేరలేని లేఖలు. అలల్ని చెరిపే ఈ గాలి
నా ఈ ఎదురు చూపుల నీడను తాకలేదు.
ఇక, నువ్వు లేవు కనుక
వెలిగించిన దీపం చుట్టూ ఉన్న గుండ్రటి స్మశానంలో
నా దహనానికి చితిని తయారు చేసుకుంటాను.
No comments:
Post a Comment