ఈ వక్షోజం ఎండిపోయింది. అది ఒక లేత నోటికి
కథలు చెప్పేది
రెండు లేత అరచేతులలో ఇసుక గూడు అయ్యేది
అది ఒక లేత బుగ్గకి
విచ్చుకున్న పూవు అయ్యేది.
సమయం కాని సమయం. క్షణం కాని క్షణం. అప్పటిదాకా
మరణం ఒక సంజ్ఞ అని తెలీదు
ఎప్పుడు నువ్వు మరణించాక ఈ వక్షోజం ఎడారి అయ్యింది
నీటి చెలామ ఎక్కడ?
No comments:
Post a Comment