కిటికీ ఊచల మధ్య నుంచి కనిపించే చిన్ని ఆకాశం నీది కాదు
పూవు చుట్టూ గిరికీలు కొట్టే పురుగు
తొలి పూవుకై తహతహ లాడే బంతి మొక్కా, ఎవరినీ
గాయపరచని సూర్య రశ్మీ
ఇవేమీ నీవి కావు. ఆ కిటికీ అంచున వాలే రహస్య పక్షీ
నీవి కావు.
ఇవన్నీ నీవన్నందుకు, చేతులకు సంకెళ్ళతో
మంచు పర్వతాల బలవంతపు నిద్రతో
తాళం వేసిన స్థలం లో నువ్వు.
ఒక్క నువ్వు.
No comments:
Post a Comment