కనిపించే ఈ రెండు వాక్యాల మధ్య
నువ్వూ నేను నిర్మించుకున్న సమాధులు ఉన్నాయి. సంవత్సరాలుగా
పిల్లల్లా పెంచుకున్న సమాధులు, ఇప్పుడు
మరణించిన నా వక్షోజాలతో నిండిపోయాయి. నీ ఎముకల్లా
చుట్టూతా చెట్లు, ఆకాశం మేఘాలూ
అరచేతుల నిండా పోగేసుకున్న పిచ్చి పూల లాంటి నా నేనుల రక్తం.
కనిపించే రెండు వాక్యాల మధ్య
మృత ముఖాల్లా పొడుచుకు వస్తున్నది నా మరణమా లేక నువ్వా?
No comments:
Post a Comment